గో ఆగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వడం లేదు

గో ఆగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వడం లేదు

హైదరాబాద్ లో  గో ఆగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వడం లేదని నిరసన తెలిపారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్, ఇతర సభ్యులు. ప్రభుత్వం తీరుకు నిరసనగా అరగుండు, సగం మీసం తీసేసి ఆందోళన చేశారు. జనవరి 2 న హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని త్రిశక్తి హనుమాన్ ఆలయం ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామన్నారు. యథేచ్ఛగా గో హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గో హత్యలను అరికట్టాలని పోరాటం చేస్తున్న.. యుగ తులసి ఫౌండేషన్ పై ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు.