నా సోదరుడిపై గర్వంగా ఉన్నా: ప్రియాంక గాంధీ

నా సోదరుడిపై గర్వంగా ఉన్నా: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన సోదరుడు సీనియర్ నేత రాహుల్ గాంధీ గురించి ఎమోషనల్ మెసేజ్ చేశారు. తన సోదరుడిపై తాను గర్వంగా ఉన్నానని చెప్పారు. సోమవారం రక్షా బంధన్ పండుగ సందర్భంగా రాహుల్ గురించి ప్రియాంక పలు వ్యాఖ్యలు చేశారు. ప్రేమించడం, ఓపికగా ఉండటం తన బ్రదర్ రాహుల్ దగ్గర నుంచి తెలుసుకున్నానని తెలిపారు.

‘సుఖ, దు:ఖాల్లో కలిసి జీవిస్తూ నా సోదరుడి నుంచి ప్రేమ, నిజం, సహనాన్ని నేర్చుకున్నా. అలాంటి సోదరుడ్ని కలిగున్నందుకు గర్వంగా ఉన్నా. దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.