కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది

కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గత సంవత్సరం ఆసీస్ జట్టు కప్ ను ఎగురేసుకొని పోయింది. అదే ఉత్సాహంతో ఈసారి కూడా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్ కు ధరించబోయే నూతన జెర్సీని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో వెల్లడించింది. టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉందంటూ క్యాప్షన్ జత చేసింది. కాస్త కొత్తగా ఇది కనిపిస్తోంది. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో టీ షర్టు ఉంది. జెర్సీపై కుడి వైపు ఆస్ట్రేలియా సింబల్, ఎడమవైపు టీ20 ప్రపంచ కప్ 2022, మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీషులో రాసి ఉంది. జెర్సీ కింది భాగంలో గ్రీన్, గోల్డ్ కాంబినేషన్ లో ఆర్ట్ వర్క్ ఉంది. 

ఇక టీ20 ప్రపంచ కప్ విషయానికి వస్తే... 

  • అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్
  • అక్టోబర్ 16 నుంచి 23 వరకు క్వాలిఫయిండ్ మ్యాచ్ లు
  • గ్రూప్ ఏలో ఊఏఈ, నెదర్లాండ్ల్స్, శ్రీలంక, సమీబియా
  • గ్రూప్ బిలో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్
  • క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12 దశకు చేరుకుంటాయి. 
  • గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్ ఏ1, బి 2 క్వాలిఫై జట్లు ఉన్నాయి. 
  • గ్రూప్ 2 విషయానికి వస్తే... బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా, సౌతాఫ్రికాతో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్ జట్లు ఉన్నాయి.
  • టీమిండియా - పాక్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 23న జరుగనుంది.