కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
  • రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని కేంద్రం నిధులతో కట్టిస్తాం..
  • స్థలం ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే.. 
  • ఊరు బయట స్మశానం పక్కన జనం రాకపోకలకు అనుకూలంగా లేని స్థలం ఇస్తామంటుండ్రు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, హైదరాబాద్, వెలుగు: రామగుండంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్​ను కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. తాను ఇదే అంశంపై గతంలో లేఖ రాయగా.. రామగుండం పట్టణ శివారులో స్థలం కేటాయించినట్లు సమాచారం ఇచ్చారన్నారు.

హైదరాబాద్​లోని ఈఎస్ఐ ఆస్పత్రి వేసిన నిపుణుల కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించి దవాఖాన నిర్మాణానికి అనుకూలంగా లేదని రిపోర్టు ఇచ్చింద న్నారు. ఆ భూమిని గతంలో రామగుండం డంపింగ్ యార్డుగా ఉపయోగించారని, దాని పక్కన రెండు శ్మశాన వాటికలున్నాయని తెలిపారు. ఈ మేరకు బస్టాండు, రైల్వే స్టేషన్ నుంచి కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండే స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు.