పద్మారావునగర్, వెలుగు: దాన్ ఉత్సవ్–2024లో భాగంగా పద్మారావునగర్‌లోని యూరో కిడ్స్ స్కూల్ నిర్వాహకులు, స్టూడెంట్ల తల్లిదండ్రులు నిత్యవసరాలు కలెక్ట్ చేసి శనివారం పలు అనాథాశ్రమాలకు అందజేశారు. న్యూ బోయిగూడలోని లిటిల్ సిస్టర్స్హోమ్ఫర్ఏజ్డ్, సీతాఫల్‌మండిలోని అమన్ వేదిక రెయిన్బో హోమ్ఫర్ ఆర్ఫన్ గర్ల్స్, సిటీ లైట్ హోటల్దగ్గరున్న ఆర్ఫనేజ్నైటింగల్హోమ్ ఫర్బాయ్స్లో నిత్యవసరాలు అందించారు. ప్రిన్సిపాల్ఎస్తార్విద్యావతి పాల్గొన్నారు.
