
- పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా కేడర్ నుంచి తొలగించి జోనల్ పోస్టులుగా మార్చాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య కోరారు. ఆదివారం రంగారెడ్డి జెడ్పీ హాల్లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను రిలీజ్ చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని కోరారు. రిటైర్డ్, సర్వీస్‌లోని టీచర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలన్నారు.
10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులను ప్రకటించి, బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి చాన్స్ ఇవ్వాలన్నారు. ఏటా సమ్మర్ హాలీడేస్‌లో బదిలీలు నిర్వహించేలా క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రత్నాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు, కృష్ణప్రియ, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.