ఇండియాలో పబ్జీ ఖేల్ ఖతం : ప‌బ్జీతో పాటు 118 చైనా యాప్స్ బ్యాన్

ఇండియాలో పబ్జీ ఖేల్ ఖతం : ప‌బ్జీతో పాటు 118 చైనా యాప్స్ బ్యాన్

కేంద్రం ప్ర‌భుత్వం ప‌బ్జీతో పాటు 118చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
దేశ సమగ్రతకు, భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే చైనాకు చెందిన మొబైల్ యాప్స్ ద్వారా ఇత‌ర దేశాల‌కు చెందిన హ్యాక‌ర్స్ దేశ ర‌క్ష‌ణ‌కు చెందిన డేటాను దొంగిలించి, ఆ డేటాను దుర్వినియోగం చేస్తున్న‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చాయి.

ఫిర్యాదుల ఆధారంగా దేశ‌ర‌క్ష‌ణ ముఖ్య‌మ‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్రం తెలిపింది.
ఈ యాప్స్ పై బ్యాన్ విధించేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు సిఫారసు చేసింద‌ని ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.