హైదరాబాద్, వెలుగు: ఎగుమతి, దిగుమతిదారుల సమావేశాన్ని హైదరాబాద్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం నిర్వహించింది. చీఫ్గెస్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్డాఫీసు జీఎంఐబీడీ స్వరాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద వాణిజ్య ఫైనాన్స్ రుణ గ్రహీతల కోసం వడ్డీ రేట్లు, మార్జిన్‌ల కోసం అనుకూలమైన పథకాలను అందిస్తున్నామన్నారు. తమ బ్యాంక్ ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో ఎగుమతిదారులు, దిగుమతిదారులకు అండగా ఉంటుందన్నారు.
మెరుగైన సేవలు, ఉత్పత్తులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పిలుపు మేరకు, ఎగుమతిదారులకు వారి ఆర్థిక అవసరాల మేరకు సకాలంలో అందించి నిరంతరం ప్రోత్సహిస్తున్నామన్నారు. రుణగ్రహీతల వృద్ధిలో తమ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ హెడ్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్వీఎస్ ప్రసాద్ రెడ్డి, సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ బీవీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ఎఫ్‌ఐఈవో మహేశ్, ఏజీఎం –ఈసీజీసీ శివ శంకరి, టీఎస్ టీపీసీ మేనేజర్ గీతాబి, ఏపీఈడీఏ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పెద్దస్వామి పాల్గొన్నారు.
