పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 పోస్టులు.. డిగ్రీ పాసై తెలుగు వస్తే చాలు.. బ్యాంక్ ఆఫీసర్ అవ్వొచ్చు!

 పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 పోస్టులు.. డిగ్రీ పాసై తెలుగు వస్తే చాలు..  బ్యాంక్ ఆఫీసర్ అవ్వొచ్చు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్–-I (జేఎంజీఎస్–I) లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అర్హత, భాషా నైపుణ్యం ఆధారంగా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జులై 20 నుంచి ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది.

పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్​బీఓ). 

మొత్తం ఖాళీలు: 545.  తెలంగాణ రాష్ట్ర పరిధిలో 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లరికల్/ ఆఫీసర్ కేడర్‌లో కనీసం ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం కలిగి ఉండాలి. 10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదవని అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్​పీటీ) నిర్వహిస్తారు.

వయోపరిమితి: 2026, జులై 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 20.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ. 109, అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. 

లాస్ట్ డేట్:  ఆగస్టు 9. 

ఆన్​లైన్ టెస్ట్ తేదీ: ఆగస్టు/ సెప్టెంబర్ (తాత్కాలికం). 

ALSO READ : రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా ఉంటే చాలు

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్​పీటీ), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  pnb.bank.inను సందర్శించండి. 

ఆన్​లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో  ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్  & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, డేటా అనాలసిస్  & ఇంటర్​ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్/ ఎకనామీ/ బ్యాంకింగ్ అవేర్​నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు.

అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 35 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు.

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన స్థానిక భాషను 10వ లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదవని అభ్యర్థులు కచ్చితంగా ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే.

పర్సనల్ ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ రాత పరీక్షలో అర్హత సాధించి షార్ట్​లిస్ట్ అయిన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించాలంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం, ఇతర అభ్యర్థులు50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఫైనల్ సెలెక్షన్
ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మెరిట్ జాబితాను రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా రూపొందిస్తారు.