టైటానిక్​ హీరోతో డేటింగ్​..

టైటానిక్​ హీరోతో డేటింగ్​..

నీలమ్​ గిల్​.. మొన్నటివరకు ఎవ్వరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగుతోంది. టైటానిక్​ హీరో లియోనార్డో డికాప్రియోతో ఆమె డేటింగ్​ లో ఉండటమే ఇందుకు కారణం. నీలమ్​ పంజాబీ– బ్రిటీష్​ మోడల్​గా గుర్తింపు తెచ్చుకుంది. 28  ఏళ్ల ఈ భారత సంతతి యువతి 58 ఏళ్ల నటుడితో రిలేషన్​లో ఉండటం ఆసక్తికరంగా మారింది.

14 ఏళ్లకే మోడలింగ్​లో అడుగుపెట్టిన నీలమ్​ సామాజిక కార్యక్రమాల్లో కూడా యాక్టివ్​గా ఉంటుంది. ఇటీవల నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్​ సెంటర్​ ఓపెనింగ్​ సమయంలో ఇండియాకు వచ్చింది. డికాప్రియో సైతం 2022లో తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అంతకుముందే అతడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఎంతో మందితో డేటింగ్​లో ఉన్నాడు. ఇప్పుడు నీలమ్​ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.