అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ

అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప2 రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది(2024) స్వాతంత్ర దినోత్సవ సంధర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించరు మేకర్స్.

పుష్ప పార్ట్ 1 ఇప్పటికే సంచలన విజయం సాధించింది. అంతేకాదు.. ఈ సినిమాలో నటనకు అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సైతం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియాగా.. అన్ని భాషల్లో ఇప్పటికే పుష్ప 2 మూవీ వెయ్యి కోట్ల రూపాయల మార్కెట్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రియేటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.