కేసీఆర్​కు దళిత ద్రోహి అవార్డు ఇయ్యాలె : కేంద్ర మాజీ మంత్రి పుష్పలీల ఫైర్

కేసీఆర్​కు దళిత ద్రోహి అవార్డు ఇయ్యాలె : కేంద్ర మాజీ మంత్రి పుష్పలీల ఫైర్
  • కేసీఆర్​కు దళిత ద్రోహి అవార్డు ఇయ్యాలె
  • కేంద్ర మాజీ మంత్రి పుష్పలీల ఫైర్

హైదరాబాద్, వెలుగు : అబద్ధాలపై పేటెంట్ కేసీఆర్ దే అని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు. దళిత సీఎం అని చెప్పి మోసం చేసిన కేసీఆర్​కు దళిత ద్రోహి అవార్డు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఆమె గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, ఎస్సీ సబ్​ప్లాన్​ను నీరుగార్చారని ఆరోపించారు.

దళితబంధు ద్వారా ఎంత మంది దళితులకు ఆర్థిక సాయం అందించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు అందిందన్నారు. బీఆర్ఎస్​ను ఓడించేందుకు కాంగ్రెస్ కేడర్ సైనికులలా పనిచేస్తున్నారన్నారు. దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను కాంగ్రెస్ ప్రకటించిందన్నారు.