ఇతనే నా కొత్త కోచ్‌‌‌‌ : పీవీ సింధు

ఇతనే నా కొత్త కోచ్‌‌‌‌ : పీవీ సింధు

హైదరాబాద్‌‌‌‌:  ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు తన కొత్త కోచ్‌‌‌‌కు వెల్‌‌‌‌కం చెప్పింది. ఇండోనేసియాకు చెందిన కోచ్​ మొహమ్మద్‌‌‌‌ హఫీజ్‌‌‌‌ హషీమ్‌‌‌‌ గైడెన్స్‌‌‌‌లో కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌‌‌‌ సుచిత్ర అకాడమీలో సింధు ప్రాక్టీస్‌‌‌‌ చేస్తోంది. అకాడమీలో హఫీజ్‌‌‌‌తో దిగిన ఫొటోను మంగళవారం ట్విట్టర్‌‌‌‌లో షేర్‌‌‌‌ చేసి ‘ఇతనే నా కొత్త కోచ్‌‌‌‌’ అని తెలిపింది.  ‘హఫీజ్ హషీమ్‌‌‌‌ను నా కొత్త కోచ్‌‌‌‌గా ప్రకటిస్తున్నందుకు  సంతోషిస్తున్నా. సుదీర్ఘమైన చర్చల తర్వాత అద్భుతమైన హఫీజ్‌‌‌‌ను కోచ్‌‌‌‌గా ఎంచుకున్నా. హైట్‌‌‌‌, స్పీడ్‌‌‌‌ నుంచి ఎటాకింగ్‌‌‌‌ వరకు నేను వెతుకుతున్న అన్ని లక్షణాలు హఫీజ్‌‌‌‌ సొంతం. తనకు నేను సాదరంగా స్వాగతం పలుకుతున్నా. హఫీజ్ గైడెన్స్‌‌‌‌తో నా ప్రయాణం భయంకరంగా ఉండబోతుంది’ అని సింధు ట్వీట్‌‌‌‌ చేసింది. 

పదేండ్ల లోయెస్ట్​ ర్యాంక్​కు సింధు

ఈ ఏడాది ఒక్క టైటిల్​ నెగ్గని సింధు పదేండ్ల లోయెస్ట్​ ర్యాంక్​కు పడిపోయింది. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ మంగళవారం రిలీజ్‌‌‌‌ చేసిన తాజా లిస్ట్‌‌‌‌లో సింధు ఐదు స్థానాలు కోల్పోయి 17 ర్యాంక్​కు దిగజారింది. చివరగా 2013 జనవరిలో సింధు ఆ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది. సైనా 31 నుంచి 36వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయింది. మెన్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌, లక్ష్యసేన్, శ్రీకాంత్ వరుసగా​ 10, 12, 20వ ర్యాంకుల్లో  ఉన్నారు.