ఓటర్‌ స్లిప్‌ లేకపోతే క్యుఆర్‌ కోడ్‌తో ఓటు వేయొచ్చు

ఓటర్‌ స్లిప్‌ లేకపోతే క్యుఆర్‌ కోడ్‌తో ఓటు వేయొచ్చు

త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అంతే కాదు ఈ సారి ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా క్యుఆర్‌ కోడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ క్యుఆర్‌ కోడ్‌ అందుబాటులోకి రానున్నది. ఈ 11 నియోజక వర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు క్యుఆర్‌ కోడ్‌ సహాయంతో ఓటు వేయవచ్చుని ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ( CEO) రణబీర్‌ సింగ్‌ తెలిపారు. పోన్‌ ఉండి, ఓటర్‌ స్లిప్‌ లేని ఓటర్లు ఓటర్స్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ నుంచి క్యుఆర్‌ కోడ్‌ను పొందవచ్చన్నారు. దీని సహాయంతో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలింగ్‌ బూత్‌లో వీటిని స్కాన్‌ చేసిన తర్వాత ఓటు వేసే కంపార్ట్‌మెంట్‌ బైట ఫోన్‌ను ఉంచి ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.