
2027 వన్డే వరల్డ్ కప్ ముందు సౌతాఫ్రికా క్రికెట్ కు భారీ ఊరట. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ సౌతాఫ్రికా జట్టులో చేరాడు. 29 ఏళ్ల వయసులో (2021) టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డికాక్.. వన్డే వరల్డ్ కప్ 2023 అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. రెండేళ్లుగా వన్డే క్రికెట్ ఆడని ఈ సఫారీ బ్యాటర్.. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో డికాక్ కథ ముగిసిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పాకిస్థాన్ పై సఫారీ వన్డే, టీ20 జట్టులో స్థానం సంపాదించి ఆశ్చర్యపరిచాడు.
పాకిస్థాన్ తో జరగబోయే వన్డే, టీ20, టెస్ట్ సిరీస్ కు సౌతాఫ్రికా జట్టును సోమవారం (సెప్టెంబర్ 22) ప్రకటించారు. టీ20, వన్డే జట్టులో డికాక్ స్థానం సంపాదించాడు. అక్టోబర్ 12 నుంచి పాకిస్థాన్ లో సౌతాఫ్రికా పర్యటించనుంది. ఈ టూర్ లో భాగంగా సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అంతకంటే ముందు నమీబియాతో అక్టోబర్ 11 న ఏకైక టీ20 ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టులో కొనసాగుతున్న డికాక్.. వన్డే రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని వైట్ బాల్ ఫార్మాట్ లో సౌతాఫ్రికాకు కొనేళ్ల పాటు తన సేవలను అందించనున్నాడు. 2021 టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డికాక్.. సుదీర్ఘ ఫార్మాట్ లో మాత్రం తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు.
సౌతాఫ్రికా ప్రస్తుత ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్.. డి కాక్ తో చర్చించి ఈ సఫారీ ఓపెనర్ మళ్ళీ వన్డేల్లో అడుగుపెడుతున్నాడనే విషయాన్ని తెలిపాడు. "క్వింటన్ వైట్-బాల్ క్రికెట్ లోకి తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత నెలలో మేము అతని భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు.. డికాక్ ఇప్పటికీ తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే బలమైన ఆశయాన్ని కలిగి ఉన్నాడని స్పష్టమైంది. అతను జట్టులోకి వస్తే జట్టు ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. డికాక్ తిరిగిరావడం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది." అని శుక్రి కాన్రాడ్ సోమవారం (సెప్టెంబర్ 22) తెలిపాడు.
వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని సౌతాఫ్రికా స్క్వాడ్ లోకి రావడంతో సౌతాఫ్రికా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికాలోనే జరగనుంది. డికాక్ లాంటి సీనియర్ బ్యాటర్ జట్టులో ఉండడంతో సఫారీ జట్టు మరింత పటిష్టంగా మారనుంది.
డి కాక్ కు 155 అంతర్జాతీయ వన్డేలు ఆడిన అనుభవం ఉంది. 45.74 యావరేజ్ తో 6770 పరుగులు చేశాడు. 96.64 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం విశేషం. ఇప్పటివరకు మూడు వన్డే ప్రపంచ కప్ లు (2015,2019,2023) ఆడాడు.
పాకిస్తాన్ టీ20లకు సౌతాఫ్రికా జట్టు:
డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగీ ఎన్‌గిడి , న్కాబా పీటర్, లువాన్-డ్రే సిమ్‌లెయాడ్ విలియస్, అండ్లీయాడ్
పాకిస్తాన్ వన్డేలకు సౌతాఫ్రికా జట్టు:
మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగి న్గిడి, న్కాబా పీటర్, ల్హువాన్ క్యూబా సిన్తోరేత్-,
నమీబియా టీ20కు సౌతాఫ్రికా జట్టు:
డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్‌సామి, న్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఆండిల్ సిమెలన్, జాసన్‌డ్ విలియత్మ్స్,
JUST IN: Quinton de Kock has been named in South Africa's ODI and T20I squads to tour Pakistan pic.twitter.com/boYHwRQTiv
— ESPNcricinfo (@ESPNcricinfo) September 22, 2025