ఆర్. కృష్ణయ్య అరెస్ట్పై ఆందోళనకు దిగిన బీసీ సంఘ నాయకులు

ఆర్. కృష్ణయ్య అరెస్ట్పై ఆందోళనకు దిగిన బీసీ సంఘ నాయకులు

రెగ్యులరైజ్ చేయాలంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేసిన ధర్నాలో మద్దతుగా నిలిచిన ఆర్. కృష్ణయ్యను అరెస్ట్ చేయడంపై.. బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసనను తెలిపారు. గత 50 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఆర్ కృష్ణయ్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వారు మండిపడ్డారు. ఉద్యోగుల పక్షాన నిలబడిన ఆయనను ఉదయం నుండి సాయంత్రం వరకు పలు పోలీస్ స్టేషన్ లకు తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించారని బీసీ సంఘ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేసి... ఆర్ కృష్ణయ్య అరెస్ట్ కు బాధ్యత వహిస్తూ.. వారికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.