ఐక్య పోరాటాలతో రిజర్వేషన్లు సాధిస్తాం... ఆర్.కృష్ణయ్య

ఐక్య పోరాటాలతో రిజర్వేషన్లు సాధిస్తాం... ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: కేంద్రంలో ప్రతిపక్షం బలంగా ఉందని, బీసీలు హక్కుల సాధన కోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కలిసికట్టుగా బీసీ సంఘాలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ మేధో మదన సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షత జరిగింది. పలు యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాలు, 48 ఉద్యోగ సంఘాల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి బీసీ నాయకులు పాల్గొన్నారు.