రిజర్వేషన్లు ఎత్తివేయ్యాలనే కుట్ర జరుగుతోందన్న కృష్ణయ్య

రిజర్వేషన్లు ఎత్తివేయ్యాలనే కుట్ర జరుగుతోందన్న కృష్ణయ్య

ఎస్సి, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు ఎత్తివేయ్యాలనే కుట్ర జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ప్రమోషన్లలో ఎస్సి, ఎస్టీలకు రిజర్వేషన్లు లేవనేదానిపై దేశవ్యాప్తంగా ఎస్సి, ఎస్టీ, బిసి నేతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  రాజ్యాంగ రిజర్వేషన్లు అమల్లో వ్యవస్థల పాత్రపై సమావేశం జరిపారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులు కావనడం సరైంది కాదన్నారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు నేతలు.