హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో వచ్చే ఆరు రోజులు పారిశుధ్యంపై స్పెషల్ఫోకస్పెట్టాలని గ్రూప్–1 ట్రైనీ మున్సిపల్ కమిషనర్లకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలను ఫీల్డ్లెవెల్లో పర్యవేక్షించేందుకు నియామకమైన 18 మంది గ్రూప్–1 ట్రైనీ మున్సిపల్ కమిషనర్లతో సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కమిషనర్ సమావేశమయ్యారు. కేటాయించిన ప్రాంతంలో ఎంతమంది శానిటేషన్ వర్కర్స్, సూపర్ వైజర్ లు ఉన్నారో ..అందులో ఎంతమంది డ్యూటీలకు వచ్చారో అన్న సమాచారాన్ని ట్రైనీ మున్సిపల్ కమిషనర్లు సేకరించాలన్నారు.
ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి? ఎన్ని రాంకీ వాహనాలు శానిటేషన్ కోసం ఉపయోగిస్తున్నారో చూడాలన్నారు. ప్రతిరోజు గమనించిన అంశాలకు సంబంధించి నోట్ ను ఇవ్వాలన్నారు. ప్రతి సాయంత్రం గ్రూప్–1 ట్రైనీ మున్సిపల్ కమిషనర్లతో వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అడిషనల్కమిషనర్లు మందా మకరందు, రవికిరణ్ పాల్గొన్నారు.
ఇందిరా పార్క్ తనిఖీ
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ఇందిరా పార్క్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్క్‌లో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. పిల్లల ప్లే ఏరియాకు రిపేర్లు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ డిప్యూటీ కమిషనర్ పుష్పలత పాల్గొన్నారు.
