వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 19న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ ‘వడ్డే నవీన్ గారితో సినిమా అని తెలిశాక చాలావరకు ఆయన గురించి రీసెర్చ్ చేశాను. ఆయన నటించిన ఎన్నో చిత్రాల గురించి తెలుసుకున్నా. ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. ఇందులో మేకప్ లేకుండా నటించాను. చాలావరకు నేచురల్‌గానే కనిపిస్తాను.
భర్తకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా ఉండే గృహిణిగా లక్ష్మీ పాత్ర ఉంటుంది. ఈ ట్రాన్స్‌ఫర్స్ విషయంలో లక్ష్మీ అనే క్యారెక్టర్ ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిరాకుపడినా కూడా భర్తకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ పాత్ర అవుతుంది.
వడ్డే నవీన్ గారు చాలా ఇంటలెక్చువల్. ఆయనకు వరల్డ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుంది. ప్రస్తుతం ‘గాసిప్’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. రకరకాల పాత్రలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని చేయాలని చూస్తున్నా’ అని చెప్పింది.
