నాలుగు గంటల పాటు రబ్రీదేవిని విచారించిన సీబీఐ

నాలుగు గంటల పాటు రబ్రీదేవిని విచారించిన సీబీఐ

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ ఇవాళ నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. 2004‌‌–09 వరకు రైల్వే కేంద్ర మంత్రిగా లాలూ ప్రసాద్​ యాదవ్​ పనిచేశారు. అప్పుడు రైల్వే ఉద్యోగాల భర్తీలో కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మిసా భారతి, హేమాపై కేసు నమోదైంది. 2022 మేలో మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం రబ్రీదేవికి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ పాట్నాలోని వారి ఇంటికి వెళ్లిన అధికారులు రబ్రీదేవిని ప్రశ్నించారు. ఆమె స్టేట్ మెంట్ మాత్రమే రికార్డు చేసుకుంటున్నామని సీబీఐ ప్రకటించింది. ముందుగా రబ్రీదేవి నుంచి అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి విచారణ కోసం సీబీఐ ఆఫీస్​కు రబ్రీదేవిని పిలిపించే చాన్స్​ ఉందని తెలుస్తోంది.