అడిషనల్ డీజీపీగా రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు

అడిషనల్ డీజీపీగా రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు
  • ఇద్దరు ఐపీఎస్‌‌లకు ఏడీజీగా పదోన్నతి

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణలో 2001వ బ్యాచ్‌‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను అదనపు డీజీపీ ర్యాంకుకు పదోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ పే రూల్స్ 2016 ప్రకారం లెవల్-15 పే మ్యాట్రిక్స్‌‌లో వీరికి పదోన్నతి లభించింది. ఏడీజీగా ప్రమోషన్ పొందిన వారిలో డాక్టర్ అకున్ సబర్వాల్, రాచకొండ కమిషనర్ సుధీర్‌‌‌‌బాబు ఉన్నారు. 

అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర డిఫ్యుటేషన్‌‌లో ఉండగా.. ప్రభుత్వం ఆయనకు ప్రోఫార్మా పదోన్నతి కల్పించింది. జనవరి 1 నుంచి సుధీర్‌‌‌‌బాబు, అకున్ సబర్వాల్‌‌ ఏడీజీలుగా కొనసాగనున్నారు.