హైదరాబాద్ లో 223 మంది బాల కార్మికులకు విముక్తి

హైదరాబాద్ లో 223 మంది బాల కార్మికులకు విముక్తి

హైదరాబాద్‌ : 223 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు పోలీసులు. ఆదివారం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో  223 మంది బాల కార్మికులను గుర్తించామని తెలిపారు. ఇటుక బట్టీలు, గాజుల పరిశ్రమ, ఇళ్ల నిర్మాణం, భిక్షాటన, దుకాణాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న 10 రాష్ట్రాలకు చెందిన బాలల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించామన్నారు. మహిళా, శిశుసంక్షేమశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు ఇలా చిన్నారుల జాడకనిపెట్టేందుకు పోలీసులు కృషి చేశారన్నారు.

బాలకార్మికుల  జీవితాల్లో తిరిగి సంతోషాన్ని తెచ్చేందుకు ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వరుసగా ఏడోసారి జనవరి ఒకటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించగా.. ఆదివారం నాటికి 223 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు పోలీసులు.