తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్బంగా రాచకొండ పోలీస్ ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కి సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025" దృష్ట్యా ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు అమలు చేశారు పోలీసులు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వాహనాలు సజావుగా సాగేలా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ కదలికల నియంత్రించనున్నారు.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మార్గం
వీడియోకాన్ జంక్షన్ నుంచి -హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే (NH-765) → తుక్కుగూడ → నెహ్రు ORR రోటరీ (Exit No: 14) హర్షగూడ మహేశ్వరం గేట్,
కొత్తూర్ x రోడ్స్ పవర్ గ్రిడ్ జంక్షన్ మీదుగా వెళ్లే వాహనాలు
ప్రత్యామ్నాయ మార్గం
తుక్కుగూడ, నెహ్రు ORR రోటరీ (Exit No: 14) రవీర్యాల, బెంగగళూరు నెహ్రు ORR రోటరీ (Exit No: 12) → మంగళపల్లి x రోడ్ నాగార్జునసాగర్ హైవే (NH-565, నాగార్జునసాగర్ Highway) ఇబ్రహీంపట్నం ఆగపల్లి (Right Turn) తోలేకలనం (పేతుళ్ళ) → గుమ్మడివెల్లి (Left Turn) ఆకులమైలారం మీర్ ఖాన్ పేట (Right Turn) తండా → పవర్ గ్రిడ్ జంక్షన్ (Right turn) మీదుగా వైకుంఠ వైపు వెళ్లాలి.
ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ NH-765: కొత్తూరు x రోడ్స్ పెద్ద గోల్కొండ, ORR Exit No:15
డైవర్షన్ రూట్: కొత్తూరు X రోడ్స్ → కొత్తూరు విలేజ్ → మహేశ్వరం విలేజ్ → మనసాన్ పల్లి X రోడ్ జైత్వరం విలేజ్ → పులిమామిడి విలేజ్ నాగరం → పెద్ద గోల్కొండ ORR.
భారీ వాహనాలకు ముఖ్యమైన గమనిక
ORR నుండి వచ్చి NH-765 లో చేరే భారీ వాహనాలు తుక్కుగూడ, నెహ్రూ ORR రోటరీ (ఎగ్జిట్ నంబర్ 14) కు బదులుగా పెద్ద గోల్కొండ, నెహ్రూ ORR రోటరీ (ఎగ్జిట్ నంబర్ 15) వద్ద డైవర్ట్ కావాలి
పార్కింగ్ ఏర్పాట్లు:
ప్రత్యేకంగా ఏడు పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు.
నావిగేషన్‌ను సులభతరం చేయడానికి, వేదిక వద్ద పార్కింగ్ ప్రాంతాలకు వినియోగదారులను మార్గనిర్దేశం చేయడానికి , మొత్తం రాకపోకలకు సంబందించి ప్రతి ప్రదేశానికి QR కోడ్‌లు ఏర్పాటు..
ప్రజలకు ప్రత్యేక సూచనలు:
- ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు వెళుతుంటే ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.
- సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించండి.
- తగిన సూచిక బోర్డులు ఉంచబడతాయి..
- కీలకమైన కూడళ్ల వద్ద పోలీసుల సూచనలను పాటించండి.
- రోడ్డు పక్కన పార్కింగ్ చేయడం పూర్తిగా నిషేదించారు..
- ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అనధికార వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు..
- ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించి రూట్ మార్పుల అనుగుణంగా రాకపోకలు సాగించాలని కమీషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ సూచన..
