V6 News

విరాట్‌‌ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు

విరాట్‌‌ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు
విరాట్‌‌కు సారీ చెప్పిన రహానె మెల్‌‌బోర్న్‌‌: ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో తన వల్ల రనౌట్‌‌ అయిన కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీకి సారీ చెప్పానని స్టాండ్‌‌ ఇన్‌‌ కెప్టెన్‌‌ అజింక్యా రహానె అన్నాడు. విరాట్‌‌ కూడా సానుకూలంగానే స్పందించాడని చెప్పాడు. ‘విరాట్‌‌ రనౌట్‌‌ వల్ల మ్యాచ్‌‌ మొత్తం ఆసీస్‌‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది నావల్లే జరిగిందని నాకు తెలుసు. అందుకే ఆ రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లి సారీ చెప్పా. అతను కూడా ఓకే అంటూ బదులిచ్చాడు. అయితే మ్యాచ్‌‌ చేజారినందుకు కాస్త బాధపడ్డాడు. అప్పుడున్న పరిస్థితిని ఇద్దరమూ అర్థం చేసుకున్నాం. చాలా బాగా ఆడుతున్న టైమ్‌‌లో నేను అలా స్పందించాల్సింది కాదు. కానీ క్రికెట్‌‌లో కొన్ని సంఘటనలు అలా జరుగుతుంటాయి. వాటిని గౌరవిస్తూనే ముందుకు సాగాలి’ అని రహానె పేర్కొన్నాడు. ఆ రనౌట్‌‌ కాకపోతే మ్యాచ్‌‌ మరోలా ఉండేదన్నాడు. మంచి పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో పాటు ఇద్దరమూ క్రీజులో కుదురుకున్నామని, మరో గంట ఆడి ఉంటే మంచి స్కోరు చేసే వాళ్లమని రహానె చెప్పుకొచ్చాడు. For More News.. పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు గోల్‌‌‌‌కీపర్లకు 644 బీర్లు పంపిన బీర్ కంపెనీ