T20 World Cup 2024: బుమ్రాకే ఛాలెంజ్ విసిరిన ఆఫ్ఘన్ బ్యాటర్.. తొలి బంతికే ఔట్

T20 World Cup 2024: బుమ్రాకే ఛాలెంజ్ విసిరిన ఆఫ్ఘన్ బ్యాటర్.. తొలి బంతికే ఔట్

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం (జూన్ 20) టీమిండియాతో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్థాన్‌ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాననని..అవకాశం  వస్తే బుమ్రా బౌలింగ్ లో దూకుడుగా ఆడడానికి రెడీ అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అయితే మ్యాచ్ లో గుర్బాజ్‌ ఆటలు సాగలేదు. చెప్పినట్టుగానే తొలి ఓవర్ లో ఫోర్, సిక్సర్ వేసి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. బుమ్రా బౌలింగ్ లో ఆడలేకపోయాడు. 

బుమ్రా బౌలింగ్ లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఈ ఆఫ్ఘన్ ఓపెనర్ కాస్త అసహనానికి గురయ్యాడు. అతి విశ్వాసం చూపించి బీరాలు పలికిన గర్భాజ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో 8 బంతుల్లో  ఒక ఫోర్, సిక్సర్ తో 11 చేసి గర్భాజ్ ఔటయ్యాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్ ల్లో 178 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. 

 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా 47 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. తర్వాత అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 134 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 53), హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (24 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 32) మెరుపులు మెరిపించగా, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా (3/7), అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ (3/36) చెలరేగారు. సూర్యకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.