హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీ

వరంగల్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్కు ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. రాత్రి 7 గంటలకు ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

మరోవైపు వరంగల్ సభ కోసం వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు కదిలివస్తున్నాయి. భారీ ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో సభా వేదిక పరిసరాల్లో సందడి నెలకొంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లించడంతో పాటు వాహనదారుల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.