కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి

తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒప్పందం చేసుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఇకపై ఏ నాయకుడైనా ఈ ప్రశ్న అడిగితే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద నేత అయినా పార్టీ నుంచి బయటకు పంపుతామని, అలాంటి ఆలోచన ఉన్నవారు టీఆర్ఎస్ పార్టీలోకో బీజేపీలోకో వెళ్లిపొండని చెప్పారు. సిద్ధాంతాలతో పోరాడుతున్న తాము రాజుతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే పోరాటం జరుగుతుందని, ఆ పార్టీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు.

తెలంగాణ రైతులు, యువత నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తిని క్షమించే ప్రసక్తేలేదని రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రజల కోసం పోరాడిన వారికే ఎన్నికల టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంత పెద్ద నేత అయినా రైతులకు అండగా నిలవకపోయినా, పేదల తరఫున పోరాడకపోయినా కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్ ఇవ్వదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.