బొంగు చికెన్..సరదా ముచ్చట్లతో ఆకట్టుకుంటున్న రాహుల్ వీడియో

బొంగు చికెన్..సరదా ముచ్చట్లతో ఆకట్టుకుంటున్న రాహుల్ వీడియో

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో సక్సెస్ ఫుల్గా ముగిసింది. రాష్ట్రం నుంచి రాహుల్ ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్లారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఫిదా అయ్యారు. ఎంతలా అంటే రాష్ట్రాన్ని వదిలివెళ్తుంటే బాధగా ఉందని రాహులే చెప్పేంతా. ఈ నేపథ్యంలోనే యాత్ర చివరి రోజుల్లో పార్టీ నేతలతో ముచ్చటిస్తూ వారితో మమేకమయ్యారు. పార్టీ నేతలు, గిరిజనులతో కలిసి బొంగులో చికెన్ వండి అందరిలో ఉత్సాహం నింపారు. 

పొలాల మధ్య గిరిజనులతో కలిసి రాహుల్ బొంగులో చికెన్ వండారు. తన చేతులతో చికెన్కు మసాలా దట్టించి బొంగుల్లో పెట్టి వాటిని మంటపై కాల్చారు. చికెన్ రెడీ అయ్యాక స్వయంగా తానే అందరికీ సర్వ్ చేశారు. చికెన్ అద్భుతమంటూ రాహుల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.