యాసిడ్ బాధితుల సమస్యలు తెలుసుకున్న రాహుల్

యాసిడ్ బాధితుల సమస్యలు తెలుసుకున్న రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళా సంఘాలతో భేటీ అయ్యారు. లంచ్ టైంలో మహిళా సంఘాలతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‭తో సమావేశమైన వారిలో ట్రాన్స్ జెండర్స్, ఒంటరి మహిళలు, యాసిడ్ బాధితురాళ్లు ఉన్నారు.  దిశా ఘటనతో పాటు మరికొన్ని ఘటనలు, హత్యాచారాలపై మహిళా సంఘాల నేతలు మాట్లాడారు. యాసిడ్ బాధితులను దగ్గరకు తీసుకుని రాహుల్ ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉన్న భద్రత, వారి సమస్యలను గురించి ఆయన ఆరా తీశారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

వీరితో సమావేశం తర్వాత పురానాపూల్ నుండి రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలోనూ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. పాద్రయాత్రలో తనతో కలిసి వస్తున్న వారికి రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా యాత్ర సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని..  ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జోడో యాత్ర కొనసాగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు.