ఢిల్లీ: ఒక సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వ్యవహారాల శాఖ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయని.. ఫలితంగా మన దేశంలో ద్రవ్యోల్పణం, ఆర్థిక అసంతృప్తి అంతకంతకూ పెరుగుతుందని.. ఈ పరిణామాలతో.. మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని.. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడం ఖాయమని.. రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఏడాది కన్నా ఎక్కువ కాలం కొనసాగదని.. రాహుల్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
►ALSO READ | ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై CBI విచారణ జరిపించాలని.. సుప్రీం కోర్టులో ప్రజా హిత వ్యాజ్యం దాఖలు
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటన సాధారణమైంది కాదని.. ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీని ఓడించలేక.. దేశంలో విద్వేషాలను, హింసను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యల వెనుక.. దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేని కాంగ్రెస్, కొన్ని ప్రతిపక్ష పార్టీలు, విదేశీ శక్తులు పన్నిన కుట్ర ఉందని గోయల్ ఆరోపించారు.
ఇక.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన చిన్నతనంలో.. ‘‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’’ అనే టీవీ సీరియల్ ఉండేదని.. అలాగే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా.. ఆయన పగటి కలలు మాత్రమేనని.. అది కేవలం కల్పన అని ఆయన అభివర్ణించారు.
