
వెలుగు: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం నాలుగున్నర నుంచి 6 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కనీస ఆదాయ హామీ పథకం విధివిధానాలు వివరిస్తారు. రాహుల్ సభ కోసం పీసీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లోనైనా రాష్ట్రంలో గౌరవ ప్రదమైన సీట్లు సాధించాలని హైకమాండ్ భావిస్తోంది. అందుకే పీసీసీ అడగకున్నా హైకమాండే తెలంగాణ వేదికగా ‘కనీస ఆదాయ హామీ’ పథకాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనుకుంటోంది. కేవలం 4 రోజుల వ్యవధితోనే పీసీసీకి రాహుల్ సభ సమాచారాన్ని ఏఐసీసీ చేరవేసింది. తొలుత నగర శివారులోని పహడీ షరీఫ్ లో సభ అనుకున్నా శంషా బాద్‌కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బూత్ లెవల్ కార్యకర్తలు సభకు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్, నిరంజన్ రెడ్డి మీడియాతో అన్నారు.