ఆయన గ్రేట్ ఫుడ్ మేకింగ్ పొలిటీషియన్ : రాహుల్ గాంధీ

ఆయన గ్రేట్ ఫుడ్ మేకింగ్ పొలిటీషియన్ : రాహుల్ గాంధీ

కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిహార్  మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్భుతంగా వంట చేస్తారని  అన్నారు. అయితే వంట విషయంలో తన తల్లి సోనియా గాంధీనే నంబర్ వన్ అని తెలిపారు. 

అయితే ఆమె వంట తన  సోదరి ప్రియాంక గాంధీకి అంతగా నచ్చదని రాహుల్ గాంధీ  తెలిపారు. సోనియా గాంధీ తర్వాత తన దృష్టిలో అత్యుత్తమంగా వంట చేసేవారిలో ప్రియాంకదే రెండో స్థానం అని వెల్లడించారు. తాను ఉదయం కాఫీ తాగుతానని, రాత్రి టీని తాగేందుకు ఇష్టపడతానని చెప్పారు. ఫ్రాన్స్‌ స్వీట్ల కన్నా  ఇండియన్ స్వీట్స్ తినేందుకే ఎక్కువ ఇష్టపడుతానని తెలిపారు.  

లోక్ సభ ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఇటీవల ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను రాహుల్ గాంధీ ఖాళీ చేశారు.  తన తల్లి సోనియా గాంధీ నివాసానికి రాహుల్ వెళ్లారు.  ఖాళీ చేసిన ఇంటి తాళాలను ఆయన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) అధికారులకు రాహుల్  అందజేశారు.