
బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారిందని.. రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు తెచ్చి నిరుద్యోగ సమస్య సృష్టించారని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు కారణంగా రెండు లక్షల మంది ఉద్యోగాలు పోతే.. జీఎస్టీతో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను.. ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేటీకరణ చేస్తూ.. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందించడం లేదన్నారు. లక్షల రూపాయలతో ఇంజనీరింగ్ చదివితే.. చివరికి కూలి పని చేయాల్సి వస్తోందన్నారు. రోజు ధరణి పోర్టల్ చూసే వ్యక్తికి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న శ్రద్ధ లేదన్నారు. కమిషన్ కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. కేసీఆర్ దానికి మద్దతు తెలిపాడని ఆరోపించారు.