సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం

సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం
  • దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష
  • సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం

హైదరాబాద్: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీల కుటుంబమే దేశానికి శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినహా మిగిలిన నేతలంతా హాజరయ్యారు. సమావేశం వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. 

దేశంలో ప్రస్తుతం అనేకరకాలైన విధ్వంసకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపదను ప్రైవేటు శక్తులకు అప్పగించడం.. మత ఛాందస భావాలు.. మతతత్వ వాదనతో జాతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష అన్నారు. భారతదేశాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలు చేపట్టాలని.. ఈ మేరకు ఐఏసీసీకి తీర్మానం ప్రతులు పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని,  దేశం కోసం, పార్టీ కోసం రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు.  1970లలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నా.. 1980లో అనూహ్యంగా పుంజుకుంది.. అదే రీతిలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. 
 

 

ఇవి కూడా చదవండి