రాహుల్ న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్

రాహుల్  న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది.  రాహుల్ గాంధీ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తుండటంతో  ఈ యాత్రకు  రెండు పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు.  ప్రస్తుతం రాహుల్ యాత్ర ఓడిశాలో ముగిసి ఛత్తీస్ ఘడ్ లోకి ఎంటర్ అయింది.  న్యాయ్ యాత్ర గత నెల జనవరిలో రెండు రోజులు బ్రేక్ పడింది.  

భారత్ జోడో న్యాయ్ యాత్ర 2024 జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లు, 110 జిల్లాల గుండా సాగుతుంది. ఇది 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాలను కవర్ చేస్తూ సాగుతుంది.  మార్చి 20న ముంబైలో యాత్ర ముగుస్తుంది. కన్యా కుమారి నుండి శ్రీనగర్ వరకు 3 వేల కిలోమీటర్లకు పైగా కాలినడకన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. దీనికి  కొనసాగింపుగా న్యాయ్ యాత్ర చేస్తున్నారు.