వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రాహుల్ గాంధీ

వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రాహుల్ గాంధీ

కరోనా వ్యాక్సినేషన్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ఎట్టకేలకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. బుధవారం ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారని...అందుకే  రెండు రోజులు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

భారత్ టీకాలపై నమ్మకం లేక రాహుల్ ఇన్ని రోజులు వ్యాక్సిన్ తీసుకోలేదా అని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. దానిపై స్పందించిన కాంగ్రెస్ ఏప్రిల్ 20న కరోనా సోకడం కారణంగా రాహుల్ గాంధీ వ్యాక్సిన్ తీసుకోవడం ఆలస్యమైందని తెలిపారు.