
- బ్యారేజీ వద్ద హెలిప్యాడ్‌కు కలెక్టర్ అనుమతి.. ఉదయం 8 నుంచి
- 11 గంటల వరకు పర్మిషన్
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారంతోనే ఆయన రాష్ట్ర పర్యటన పూర్తయినప్పటికీ, గురువారం కూడా పర్యటన కొనసాగించనున్నారు. ఇటీవల పిల్లర్లు కుంగిన మేడిగడ్డ బ్యారేజీని గురువారం ఆయన పరిశీలించనున్నారు. రాహుల్ పర్యటనకు అధికారులు ఆలస్యంగా అనుమతులిచ్చారు.
బుధవారం రాత్రి వరకు పర్మిషన్ కోసం వేచి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రోడ్డు మార్గంలోనైనా వెళ్తామని పార్టీ నేతలు ప్రకటించడంతో ఆలస్యంగా షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. అంబటిపల్లిలోని బ్యారేజీ వద్ద హెలిప్యాడ్ కు అనుమతి ఇస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారని.. అందుకు ఆర్ అండ్ బీ, ఫైర్ డిపార్ట్‌మెంట్లకు అవసరమైన డబ్బులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి 11గంటల వరకు హెలిప్యాడ్ కు పర్మిషన్ ఇచ్చారు.
అంబటిపల్లిలో మహిళా సదస్సు...
మహాదేవ్‌పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామం లో నిర్వహించనున్న మహిళా సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు. సదస్సు కోసం ఎలక్షన్ ఆఫీసర్ల నుంచి అనుమతులు తీసుకున్నట్టు లీడర్లు తెలిపారు.