
ఖమ్మంలో జూలై 2న జరగనున్న కాంగ్రెస్ జనగర్జన సభకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రేపు సాయంత్రం 5 గంటలకు రాహుల్ ఖమ్మం చేరుకోనున్నారు. 5.30 గంటలకు రాహుల్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత రోడ్డు మార్గాన తిరిగి గన్నవరం వెళ్తారు .
పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఇదే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరో వైపు జనగర్జన సభకు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. ఖమ్మం సభ నుంచే ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని భావిస్తున్నారు.