రాహుల్ ఆస్తి 15.88 కోట్లు

రాహుల్ ఆస్తి 15.88 కోట్లు

వయనాడ్(కేరళ): కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన ఆస్తి 15,88,77,083 రూపాయలుగా పేర్కొన్నారు. గురువారం వయనాడ్ లోక్ సభ స్థానానికి దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు సమర్పించారు. దీని ప్రకారం రాహుల్ స్థిరాస్థుల విలువ 5,80,58,799 రూపాయలు, చరాస్థుల విలువ 10,08,18,284 రూపాయలు. సొంత కారు లేదు. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి రూ.72 లక్షల అప్పు తీసుకున్నారు. చేతిలో 40 వేల రూపాయలు, బ్యాంకుల్లో 17.93 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు. 2014లో లోక్ సభ ఎన్ని కల సందర్భంగా ఆయన తన ఆస్తుల విలువ 9.4 కోట్ల రూపాయలని వెల్లడించారు. ఈ లెక్కన కాంగ్రెస్ చీఫ్ ఆస్తి ఐదేళ్లుగా ఏటికి ఒక కోటి చొప్పున పెరిగిందన్నమాట.