డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్

డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు..  2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్

తెలంగాణ రాష్ట్రంలో  డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.  ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్నాయి. దాడుల్లో నకిలీ ప్రాక్టిషనర్స్, అనుమతుల్లేని మెడికల్ షాపులను సీజ్ చేస్తున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. క్వాక్ క్లినిక్స్ ను అధికారులు సీజ్ చేస్తున్నారు. 150 రకాల యాంటిబెటిక్స్ డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. 

ఇస్మా యిల్ అనే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ను అరెస్టు చేశారు.  2లక్షల 50 వేల మెడిసిన్లను సీజ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కంటే అధిక  ధరలకు మెడిసిన్ అమ్ముతున్న పలు మెడికల్ షాపులను సీజ్ చేశారు. 

మంగళవారం రోజు శామిర్ పేటలోని ఆస్పెన్‌ బయోఫార్మా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో డీసీఏ అధికారులు పెద్దమొత్తంలో బ్యాన్ చేసిన రెండు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్' 110 కిలోలు, 'గాటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్'లను స్వాధీనం చేసుకున్నారు.