సీజ్ చేసిన డ్రగ్స్ను అమ్ముకుంటున్న ఎస్సై

సీజ్ చేసిన డ్రగ్స్ను అమ్ముకుంటున్న ఎస్సై

హైదరాబాద్ : డ్రగ్స్ ను  అరికట్టాల్సిన అధికారే వాటిని అమ్ముతున్నాడు. నార్కోటిక్ టీమ్ లో పనిచేస్తూనే.. ఈ దందాతో నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. డబ్బు కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకొని సీజ్ చేసిన డ్రగ్స్ ను కొట్టేసి మరీ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా సొంత ఇంట్లో లాకర్ లో ఉంచి.. డ్రగ్స్ దందా చేస్తున్నాడు.. 

 డ్రగ్స్ కేసులో సైబరాబాద్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ను  అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. ఇటీవల డ్రగ్స్ అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఈ టీమ్ లో సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ కూడా ఉన్నాడు. నిందితులనుంచి సీజ్ చేసిన డ్రగ్స్ ను కొట్టేసి విక్రయించేందుకు రాజేందర్ సిద్దమైనట్లు తేలింది. ఉన్నతాధికారులు విచారణ లో నిగ్గు తేల్చడంతో రాయదుర్గం ఎస్సై రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఫిబ్రవరిలో డ్రగ్స్ కేసులో ముంబై వెళ్లాడు రాజేందర్. అక్కడ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ను అరెస్ట్ చేశాడు. నైజీరియన్ దగ్గర 1750 గ్రాముల  డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు.  ఇటీవల  డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఎస్సై రాజేందర్ పట్టుకున్నాడు.. సీజ్ చేసిన డ్రగ్స్ లో కొంత కొట్టేసి ఇంట్లోని లాకర్ లో దాచిపెట్టాడు. విచారణలో తేలింది.