V6 News

రైల్వే ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారించాలి: ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ

రైల్వే ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారించాలి: ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ
  • ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి రాఘవయ్య డిమాండ్​ చేశారు. ప్రమాదంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కోరమండల్ ఎక్స్​ప్రెస్ మెయిన్​ లైన్ నుంచి లూప్ లైన్​లోకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా మిస్టీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని, దీనిపైన లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని ఎన్ఎఫ్ఐఆర్ ఆఫీసులో మీడియాతో  ఆయన మాట్లాడారు. సిగ్నల్ ప్రకారమే లోకో పైలట్ నడిపినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ట్రైన్ లూప్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మిస్టీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మళ్లడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది” అని రాఘవయ్య వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్​వాసికి గాయాలు..

ఒడిశా రైలు ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన కె. అవినాష్  అనే వ్యక్తి గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. అతడిని బాలాసోర్ ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.