
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధి మౌలాలీలోని రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రం శనివారం 39వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించుకోనుంది. ముఖ్య అతిథిగా కేంద్ర రైల్వేలు, బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్ పాటిల్ ధన్వే పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సీనియర్ అధికారులు, రాష్ట్ర పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖలు, రైల్వేలు , ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా అర్హులైన ఆర్పీఎఫ్ సిబ్బందికి ‘విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం, విశిష్ట సేవకు భారతీయ పోలీసు పతకం, సర్వోత్తమ్, జీవన్ రక్ష పదక్, ఉత్తమ్ జీవన్ రక్ష పదక్, ‘జీవన్ రక్ష పదక్’ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తారు.