ఉదయం ఉక్కపోత..సాయంత్రం వాన..తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజలు భారీ వర్షాలు

ఉదయం ఉక్కపోత..సాయంత్రం వాన..తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజలు భారీ వర్షాలు

 ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు, పెరిగిన ఎండల కారణంగా వర్షాలు పడే చాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది   ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరగడంతో  ఉక్కపోత వాతావరణం ఉంది.   సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా  ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

 రాష్ట్రవ్యాప్తంగా 31 నుంచి 35 డిగ్రీల మధ్య  ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.   ఉదయం  ఎండలు, సాయంత్రం వాతావరణ మారుతుండటంతో వర్షాలు పడే అవకాశం ఉంది. 

 తెలంగాణలో ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి మూడు రోజుల పాటు  పలు జిల్లాలో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  వచ్చే రెండు ముడు గంటల పాటు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. 

 సెప్టెంబర్ 10న   ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  ఈరోజు ఉరుములు, మెరుపులు  ఈదురు గాలులు ( గంటకు 30-40 కి. మీ వేగంతో   కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

సెప్టెంబర్ 11న కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉందని తెలిపింది.