V6 News

రాష్ట్రంలో మరో  మూడు రోజులు వానలు.. ఎల్లో అలర్ట్  జారీ

రాష్ట్రంలో మరో  మూడు రోజులు వానలు.. ఎల్లో అలర్ట్  జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే  మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, గాలులు ఉండవని తెలిపింది. రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడగా, చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హనుమకొండ, మహబూబ్‌‌‌‌నగర్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్‌‌‌‌ సహా పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.