షాద్ నగర్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం... చిరుజల్లులతో కూల్ కూల్..

షాద్ నగర్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం... చిరుజల్లులతో కూల్ కూల్..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులు కురిశాయి. ఆదివారం ( మే 24 ) ఉదయం నుంచి ఎండ దంచికొట్టిన క్రమంలో తీవ్రమైన వేడితో జనం ఇబ్బంది పడ్డారు. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చిరుజల్లులు కురిసాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు షాద్ నగర్ వాసులు. 

రోజంతా ఉక్కపోత, తీవ్రమైన వేడితో ఇబ్బంది పడిన స్థానికులకు ఈ సాయంకాలపు జల్లులు ఎంతో ఊరటనిచ్చాయి. ఈ అకస్మాత్తు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

ఇదిలా ఉండగా..కొడంగల్ నియోజకవర్గంలో శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా నష్టపోయిన రైతులు శనివారం కురిసిన వర్షానికి కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు.