రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ  అధికారులు తెలిపారు . ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్  ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. సింగరేణి KTK ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లోకి వరద నీరు చేరడంతో.. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, చెక్ డ్యాంలు అలుగులు పారుతున్నాయి. చెక్ డ్యాంలు టూరిజం స్పాట్లుగా మారాయి. మహబూబ్ నగర్ లో చెరువుల దగ్గర జనంతో సందడి వాతావరణం ఏర్పడింది.