మంటల్లో తగలబడిన రెయిన్ బో ట్రావెల్స్ బస్సు.. మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఘటన

మంటల్లో తగలబడిన రెయిన్ బో ట్రావెల్స్ బస్సు.. మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఘటన

నల్గొండ: నల్గొండ జిల్లాలో శనివారం అర్ధరాత్రి సుమారు 01:30 గంటల సమయంలో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారి-65 (NH-65)పై రెయిన్ బో ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మియాపూర్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుంచి దించేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గుర్తించి బయటకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చిట్యాల పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.