రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు

జులై 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో... ఇవాళ, రేపు  రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని..ఎల్లుండి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని సూచించింది. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు..ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. రానున్న 3 రోజుల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ  తెలిపింది.